అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం డుడుమ జలపాతం వద్ద రెండు రోజుల క్రితం గల్లంతయిన ఒరిస్సా బరంపురం ప్రాంతానికి చెందిన సాగర్ అనే యువకుని ఆచూకీ నేటి వరకు లభ్యం కాలేదు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయం వరకు గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు ఆ ప్రాంతంలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడం కారణంగా గాలింపు చర్యలకు ఆటంకంగా మారిందని వెల్లడించారు. అయితే గతంలో ఇదే ప్రాంతంలో గల్లంతైన వ్యక్తి ఏడు రోజుల తర్వాత మృతదేహంగా బయటికి వచ్చారని గతంలో జరిగిన ఘటనను గుర్తు చేశారు.