కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో నీటి కుంటలో పడి ఆరుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటన పై ఎంపీ బస్తిపాటి నాగరాజు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు వర్షాకాల పార్లమెంట్ సమావేశాలలో భాగంగా ఢిల్లీలో ఉన్న ఆయన, ఫోన్ ద్వారా ఘటన కు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులతో అడిగి తెలుసుకున్నారు.. ఇలాంటి సంఘటనలు పునారావృతం కాకుండా తగు చర్యలు చెప్పట్టాలని ఆదేశించారు... స్కూల్ ముగిసిన అనంతరం నీటి కుంటలో ఈత కొట్టెందుకు వెళ్లి ఐదవ తరగతి చదువుతున్న ఆరుగురు చిన్నారులు మృతి చెందడం బాధాకరమన్నారు...