పోతంగల్ మండలం మంజీరా నది నుండి బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు మూడు ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తుంటే పట్టుకున్నట్లు తాసిల్దార్ మల్లయ్య వెల్లడించారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకుని సీట్ చేసి ఇసుకతో పాటు ట్రాక్టర్లను తాసిల్దార్ కార్యాలయానికి తరలించినట్లు వెల్లడించారు.