రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ ఓ ఆర్ ఆర్ ఫై సిమెంట్ లారీ శుక్రవారం బోల్తా పడింది. ఈ సందర్భంగా స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మద్యం మత్తులో డ్రైవర్ వేగంగా లారీని నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని లారీని ఎగ్జిట్ కేట్ వద్ద ఉంచారు .ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుడు చేపట్టారు.