గణపతి నవరాత్రి ఉత్సవాలు,నిమజ్జన కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం 5గంటలకు R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలెక్టర్ పమేలా సత్పతి, CP గౌస్ ఆలం,మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్,అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాఖడే,లక్ష్మి కిరణ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చూసుకున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా పరిపాలన ఉంటుందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.