అనంతపురంలో బుధవారం జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సూపర్ సెక్స్ సూపర్ హిట్ సభ సూపర్ సక్సెస్ అయితే వైసిపి నాయకులకు మాత్రం అట్టర్ ఫ్లాప్ అయినట్లు ఊహించుకొని మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. జగన్మోహన్ రెడ్డి సూపర్ హిట్ అయిన కార్యక్రమాన్ని అట్టర్ ఫ్లాప్ అయిందని ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం సిగ్గుచేటు అన్నారు. సూపర్ సిక్స్ పథకాలను అందుకున్న ప్రజల హర్షద్వానాల మధ్య సభ దద్దరిల్లిందని చెప్పారు.