అల్లూరి జిల్లా జిమాడుగుల మండలం నుండి చింతపల్లి వెళ్లే ప్రధాన రహదారి కొక్కిరాపల్లి ఘాట్ రోడ్డులో రక్షణ గోడలు శిథిలావస్థకు చేరుకోవడం రోడ్డుకి పక్కనే భారీ గోతులు ఏర్పడడం పై అక్కడి సమస్యను వీడియో తీసి శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పాడేరు మీడియాకి సామాజిక కార్యకర్త అర్జున్ రెడ్డి చేరవేశారు. స్థానికులతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించి ప్రమాదకరంగా మారిన కొక్కిరపల్లి ఘాట్ రోడ్డును సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవాలని అక్కడ ఉన్న పరిస్థితి దృష్ట్యా ఎటువంటి ప్రమాదం జరిగి ప్రాణనష్టం జరిగిన ఎవరు బాధ్యులు అంటూ ఆ వీడియోలో ప్రశ్నించారు.