పాణ్యం రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మరిన్ని వసతి సౌకర్యాలు కల్పిస్తామని ఇందులో భాగంగానే 2 వ ప్లాట్ ఫారం నిర్మించి అభివృద్ధి చేయడం జరిగిందని గుంటూరు డీ ఆర్ యం సుధేష్ణ షేన్ గుంతకల్ డి ఆర్ యం చంద్ర శేఖర్ గుప్తా తెలిపారు. సోమవారం రైల్వే స్టేషన్లో నూతనంగా నిర్మించిన రెండవ ప్లాట్ఫారంను రైల్వే ఉన్నతాధికారులు ప్రారంభించారు. పాణ్యం నుంచి నంద్యాలకు డబల్ లైన్ ఓపెనింగ్ కూడా ప్రారంభించారు.