విశాఖ జిల్లా మాధవధార యువ నటుడు పేడాడ సందీప్ సరోజ్ అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవం అందుకున్నారు. దుబాయ్‌లో శనివారం జరిగిన ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకలో 'కమిటీ కుర్రోళ్లు' సినిమాలో అద్భుతమైన నటనకుగానూ అతడికి ఉత్తమ నూతన నటుడు (బెస్ట్ డెబ్యూ హీరో) పురస్కారం లభించింది.గ్రామీణ నేపథ్యంతో వచ్చిన 'కమిటీ కుర్రోళ్లు' సినిమా కమర్షియల్‌గా విజయం సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ చిత్రంలో తన సహజమైన నటనతో సందీప్ ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు.