శ్రీ సత్య సాయి జిల్లా కదిలి పట్టణంలోని పివిఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాలులో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం అయిన సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో మహిళలతో మెగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 332 సంఘాలలోని 3320 మంది సభ్యులకు 28.23 కోట్ల మెగా చెక్కును, శ్రీనిధి 1127 మంది సభ్యులకు 9.52 కోట్ల మెగా చెక్కును ఎమ్మెల్యే అందజేశారు.