నాటి వామపక్ష పార్టీల పోరాట ఫలితమే నేటి ఉచిత విద్యుత్ అని సీపీఎం, సీపీఐ, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీల నాయకులు అన్నారు. విద్యుత్ పోరాటం జరిగి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం సాయంత్రం గద్వాల జిల్లా కేంద్రంలో నాటి పోరాట అమరులకు నివాళులర్పించారు. నేడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం జరిగే పోరాటాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు