అల్లూరి జిల్లా రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీలో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ప్రత్యేకంగా మారేడుమిల్లి మండలం వరుసగా 12వ నెల కూడా శాతం 95 కంటే ఎక్కువ పంపిణీ చేసి రాష్ట్రంలో మొదటి స్థానం దక్కించుకుంది. సెప్టెంబర్ నెలలో జిల్లాలో మొత్తం 1,22,876 పెన్షన్లు విడుదల కాగా, అందులో 1,06,325 మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తయింది. ఈ మేరకు పంపిణీ శాతం 86.53గా నమోదై రాష్ట్ర సగటు కంటే ఎక్కువగా నిలిచిందని ఎంపీడీఓ మారేడుమిల్లి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు.జిల్లాలో రాంపచోడవరం, భద్రాచలం, చింతపల్లి, హుకుంపేట, అరకు వ్యాలీ వంటి మండలాలు కూడా 90 శాతం దాకా పంపిణీ పూర్తి చేయడం విశేషం.