మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వార్డెన్ శ్రీనివాస్ను శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు శనివారం మధ్యాహ్నం హాస్టల్ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి పురుషోత్తం నాయక్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వార్డెన్ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో హాస్టల్లో విద్యార్థులపై బయటి వ్యక్తులు దాడి చేశారని ఆరోపించారు.