శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చేతులమీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదలైన 20 లక్షల రూపాయల విలువైన చెక్కులను 29 మంది లబ్ధిదారులకు గురువారం పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు.