భారీ వర్షాలతో అతలాకుతలం అవుతూ ప్రజలు ఆందోళన చెందుతుంటే.. ప్రకాశం జిల్లా లోని ఆ ప్రాంతంలో మాత్రం బుధవారం వరద నీరు చూసిన ప్రజలు గంతులు వేస్తూ పూజలు నిర్వహించారు. ఇటువంటి అరుదైన సంఘటన గిద్దలూరు సమీపంలోని కొండపేట వద్ద చోటుచేసుకుంది. కొద్దిరోజులుగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో సగిలేరు వాగుకు వరద నీరు వచ్చి చేరుతుంది. నాలుగు సంవత్సరాల తర్వాత సగిలేరు వాగులో వరదనీరు వస్తుండడంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యువకులు సగిలేరు వాగులో ఈత కొడితే మహిళలు వాగుకు దండం పెడుతూ నమస్కరించారు.