రేవంత్ ప్రభుత్వం చేతకాక కెసిఆర్ పై కుట్రపూరితంగా వ్యవహరిస్తూ కాలేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు చేస్తున్నారని వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ విమర్శించారు. అందుకు నిరసనగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు భజనలు చేస్తూ తబలా వాయిస్తూ వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ నినాలతో ర్యాలీ నిర్వహించి అనంతరం అమరవీరుల స్తూపం వద్ద వినతి పత్రం సమర్పించారు.