జైనూర్ కి చెందిన మహబూబ్(17) అనే యువకుడు ASF వాగులో స్నానానికి వెళ్లి మృతి చెందినట్లు ASF సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. సీఐ మాట్లాడుతూ.. జైనూర్ కు చెందిన మహబూబ్ ASF లో బందువుల ఇంటికి వచ్చాడు. తన బంధువులతో కలిసి ASF పెద్దవాగులో ఆదివారం స్నానానికి వెళ్లి ముగ్గురు గల్లంతు అయ్యారు. ఇద్దరిని ట్రాక్టర్ డ్రైవర్ కాపాడగా మహబూబ్ గల్లంతయ్యాడు. 2 గంటలు గాలింపు తర్వాత యువకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని స్థానికుల సాయంతో బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం ASF ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.