ఎం.బి.బి.ఎస్. మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు జాతీయ అర్హత ప్రవేశ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతినిధులు తెలిపారు. శనివారం సాయంత్రం న్యూఢిల్లీ నుండి దేశంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్.పి. లు, ఉన్నతాధికారులతో అర్హత ప్రవేశ పరీక్షల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతినిధి మాట్లాడుతూ జాతీయ అర్హత ప్రవేశ పరీక్షలను పూర్తి భద్రత నడుమ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.