ASF పట్టణంలోని వినాయకులను నిమజ్జనం కొరకు ఇక్కడికే తీసుకు వస్తారని, భక్తులకు, వినాయక శోభయాత్ర వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రహదారి చదును చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. నిమజ్జన ప్రదేశం వద్ద వాహనాలు తిరిగే విధంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. నిరంతరం వెలుతురు ఉండే విధంగా లైట్లు ఏర్పాటు చేయాలని, వినాయక ప్రతిమల నిమజ్జనం కొరకు క్రేన్ ఏర్పాటు చేయాలని తెలిపారు. నిమజ్జనం రోజున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.