రంగారెడ్డి జిల్లా: వినాయక చవితి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని మనసురాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి అధికారులను సోమవారం ఆదేశించారు. సరూర్ నగర్ హయత్ నగర్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండపాలు వద్ద త్రాగునీరు మొబైల్ టాయిలెట్లు రోడ్లు మరమ్మతులు లైటింగ్ శానిటేషన్ ట్రాఫిక్ డైవర్షన్ పోలీసులు సమయం ఉంటే అంశాలపై ప్రత్యేకమైన దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పోలీస్ అధికారులు జిహెచ్ఎంసి అధికారులు తదితరులు పాల్గొన్నారు.