పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో గుండెపోటుతో ఓ ప్రయాణికుడు మరణించినట్లుగా గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రైల్వే ఎస్సై రమేష్ బాబు తెలిపారు. మృతుడు రేపల్లెకు చెందిన జానకిరామయ్య 70 సంవత్సరాలుగా పేర్కొన్నారు. విశ్రాంతి తీసుకుంటుండగా నిద్రలోనే ఆయనకు గుండెపోటు వచ్చిందని తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి తరలించినట్లుగా తెలియజేయడం జరిగింది.