పల్నాడు జిల్లా,దాచేపల్లి మండలం పెదగార్లపాడులో మహిళ దారుణ హత్యకు గురైంది.గ్రామానికి చెందిన పోలమ్మ (50),భర్త చనిపోవడంతో గత కొంతకాలంగా గుంటూరులో ఉన్న కుమార్తె వద్ద నివాసముంటుంది.వితంతువు పెన్షన్ కోసం గ్రామానికి వచ్చిన పొలమ్మను అర్థరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు.పొలమ్మ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు మంగళవారం పొలమ్మ తన ఇంట్లో రక్తపు మడుగులో ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు.సంఘటన స్థలానికి చేరుకున్న పల్నాడు ఎస్పీ పరిశీలించారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.