పామర్రు మండలం నిమ్మకూరులో నందమూరి హరికృష్ణ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నందమూరి కుటుంబసభ్యులు నందమూరి సుహాసిని, నందమూరి రామకృష్ణలతో కలిసి ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా నివాళులర్పించారు. నందమూరి తారక రామారావుకి రథసారథిగా ఉండి, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన హరికృష్ణ జయంతిని పురస్కరించుకుని ఆయనను స్మరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని నాయకులు పేర్కొన్నారు.