విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం లోని సారిపల్లి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై గణేష్ సోమవారం సాయంత్రం తెలిపారు. గ్రామానికి చెందిన మజ్జి అన్నపూర్ణ అనే వృద్ధురాలు తన ఇంటి వద్ద ఉన్న పాన్ షాప్ బయట కుర్చీలో నిన్న రాత్రి కూర్చొనగా కుదిపి వైపు నుంచి వస్తున్న ఓ వ్యాన్ నిర్లక్ష్యంగా నడిపి వృద్ధురాలిని ఢీకొట్టాడు. దీంతో అన్నపూర్ణకు తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం విజయనగరం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంచడంతో నిన్న అర్ధరాత్రి సుమారు 11 గంటల సమయంలో మృతి చెందిందన్నారు.