నెలలో 15 రోజుల్లో రెండుసార్లు ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు పశ్చిమగోదావరి జిల్లాలోని రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ప్రత్యేకంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలంలో వరి రైతులు కోలుకోలేని నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ఎన్నో ఆశలతో వేలాది రూపాయలు వెచ్చించి సాగు చేసిన వరి పొలాలు వారం పది రోజులు పాటు వర్షపు నీటిలో మునిగిపోవడంతో నాట్లు పూర్తిగా కుళ్లిపోయాయి. బుధవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కోరుకున్న వర్షానికి సర్వపంట వదులుకోవడం తప్ప మరో మార్గం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. తక్షణ సహాయం అందించి, కొత్తగా సాగు చేసుకునే మార్గాలు చూపించాలని కోరారు.