సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో భారీ వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను మండల వ్యవసాయ అధికారి అవినాష్ వర్మ పరిశీలించారు. శుక్రవారం మండలంలోని రేజింతల్ గ్రామంలో నీట మునిగిన పంటలను క్షేత్రస్థాయిలో తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో వివిధ గ్రామాల్లో 926 ఎకరాల్లో భారీ వర్షాలతో నీట మునిగి పత్తి మినుము, సోయా పంటలు నష్టపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.