నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం హెచ్. కొట్టాలలో బుధవారం రాత్రి 6 ఇళ్లల్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. సుమారు 15 తులాల బంగారు, 26 తులాల వెండి, రూ.1,92,500 నగదు అపహరించారు. అయితే దొంగలు సీసీ కెమెరాలకు చిక్కారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.