అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం సోమవారం రాత్రి 7 గంటల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో డిఆర్డిఏ, మెప్మా, డ్వామా శాఖల అధికారులు, కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బందితో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో మొబిలైజేషన్ జాగ్రత్తగా చేయాలన్నారు. ఈ విషయమై కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేయాలని, మండలానికొక మానిటరింగ్ అధికారిని ఏర్పాటు చేయాలన్నారు.