గోకవరం మండలంలో గణపతి ఉత్సవాలను పోలీస్ అధికారులు బుధవారం పరిశీలించారు.అయితే గోకవరం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న విఘ్నేశ్వరుని సందర్శించారు. ఎస్పీ చెంచు రెడ్డి, డీఎస్పీ శ్రీకాంత్, సత్య కిషోర్, ఎస్సై పవన్ కుమారుకు గణేష్ కమిటీ సభ్యులు శాలువ కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు. రాజమండ్రి అర్బన్ అడిషనల్ ఎస్పీ చెంచు రెడ్డి మాట్లాడుతూ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని, అలాగే మండపాల వద్ద భక్తి పాటలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉండాలని హోరెత్తించే పెద్ద శబ్దాలతో ఎవరికి ఇబ్బంది కలిగించకూడదని అన్నారు