శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట టిడిపి కార్యాలయంలో గురువారం ఉదయం 10 గంటలకు స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతించిన ఐదు సంవత్సరాలలో లక్షల కోట్లు అప్పులు తెచ్చి.. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మార్చాలని, రాష్ట్రం దివాలా తీసే స్థాయికి చేరిందన్నారు. ప్రస్తుతం మనకున్న ఆస్తి మన సీఎం చంద్రబాబు అని, ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పరిపాలన సాగుతుందన్నారు.