నెల్లూరులోని మినీ బైపాస్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల కొనుగోలుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. మట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాలు కొనడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి తమకు ఇష్టమైన వినాయక విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. ఈసారి ధరలు కూడా గత ఏడాదితో పోలిస్తే ఎక్కువగానే ఉన్నాయి. అయినా కూడా భక్తులు మాత్రం నచ్చిన ఆకృతిలో వినాయకుని కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్తున్నారు.