వర్షాలు పడుతుండడంతో యూరియా అవసరం ఎక్కువ కావడం రైతులకు సరిపడా యూరియా అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ క్రమంలో గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు నాగర్ కర్నూల్ లింగాల మండల కేంద్రాలలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ఎదుట యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు పోలీసులు వారిని అదుపు చేసేందుకు తిప్పలు పడుతున్నారు