ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నేడు మంగళవారం రోజున మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు టి. ఎల్ రవి హాజరై మాట్లాడుతూ విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రినీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.