విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చిత్తూరు నియోజకవర్గం శాసన సభ్యులు గురజాల జగన్ మోహన్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పి సి ఆర్ ప్రభుత్వ హై స్కూల్ నందు జిల్లా విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు,మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వము సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ సౌజన్యంతో కృత్రిమ అవయవాల తయారీ సంస్థ (ALIMCO) కాన్పూర్ సహాయ పరికరాల గుర్తింపు శిబిరాన్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో కలసి చిత్తూరు శాసన సభ్యులు గురజాల జగన్ మోహన్ ప్రారంభించారు.