కాకినాడ జిల్లాలోని తాళ్లరేవు మండలం ధరియాల తిప్ప సమీపంలో ONGC గ్యాస్ పైప్ లీక్ అయింది. రాత్రి 1.30 గంటల సమయంలో గ్యాస్ లీక్ కారణంగా భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. సుమారు గంటన్నర వ్యవధిలోనే మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారని అధికారులు సీఎంకు తెలియజేశారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదని వెల్లడించారు.అయితే, ఈ ఘటనలు మరోసారి జరగకుండా పైప్‌లైన్‌ను పూర్తిగా చెక్ చేయాలని కలెక్టర్‌కు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ