అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్ధర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్ ప్రాంతాల్లో కార్పొరేటర్ సబిహ గౌసుద్దీన్ జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ తో కలిసి నాలా పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. వర్షాకాలంలో నాలా ఓవర్ ఫ్లో అవడంతో చుట్టుపక్కల ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కార్పొరేటర్ తెలిపారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని జోనల్ కమిషనర్ ను కోరారు.