ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు ట్రేస్ చేసి రికవరీ చేసిన 53 సెల్ఫోన్లను ఫిర్యాదుదారులకు డీఎస్పీ ప్రమోద్ శనివారం అందజేశారు. మొబైల్ పోయిన వెంటనే బాధితులు పోలీస్ చాట్బాట్ నంబర్ 9121101107 వివరాలు నమోదు చేయాలని డీఎస్పీ తెలిపారు. ఈ వివరాలు సెంట్రల్ డేటాబేస్లోకి చేరి, మొబైలు రికవరీ చేసిన తర్వాత బాధితులకు అందజేస్తామని వెల్లడించారు.