నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్ల మూసివేత నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. సోమవారం వరద నీటి ఇన్ ఫ్లో తగ్గిపోవడంతో 4 గేట్లను కట్టివేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ లోకి 20,376 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా ప్రధాన కాలువలోకి 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1404.65/1405.00 అడుగులకు చేరుకొనగా ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 17.296/17.802 టిఎంసి లకు చేరుకుంది .