యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని అక్రమంగా టిప్పర్లతో వెంచర్లకు మట్టి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు తీరుపై పోలీసులు దర్యాప్తును చేస్తున్న సంఘటన మండలంలోని మంగళవారం బొందుగుల గ్రామ రెవెన్యూ పరిధిలో చోటుచేసుకుంది.బొందుగుల గ్రామ రెవిన్యూ పరిధి నుంచి ఆలేరు మండలం కొలనుపాక మధిర గ్రామం అయినటువంటి రాజానగరం పరిధిలోగల ఓ వెంచర్కు మంగళవారం టిప్పర్ల ద్వారా ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్నారు.గత ఐదు రోజుల నుంచి మట్టి తరలిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మట్టి తరలింపు పై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.