మందస ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యుల పనితీరుపై ఆరాతీశారు. సిబ్బంది ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మౌలిక సదుపాయాల కొరత తదితర సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానన్నారు. వైద్యాధికారి డా. మౌనిక నుంచి పలు వివరాలు సేకరించారు.