నల్లగొండ జిల్లా: దేశ స్వాతంత్ర ఉద్యమానికి బిజెపికి ఎలాంటి సంబంధం లేదని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు శుక్రవారం అన్నారు .తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం కు వ్యతిరేకంగా పోరాడి అశులు బాసిన వల్లాల గ్రామంలోని అమరవీరులకు స్మారకార్ధంగా స్తూపాన్ని ఏర్పాటు చేసి శుక్రవారం ఆవిష్కరించారు. దేశ స్వాతంత్రం కోసం కాంగ్రెస్ నాయకులు ఇతర స్వాతంత్ర సమరయోధులు ఎన్నో త్యాగాలు చేశారని ఆయన గుర్తు చేశారు.