జిల్లాలో క్రిమినల్, రెవెన్యూ, సివిల్ సంబంధిత కేసులు త్వరగా పరిష్కారం అయ్యే విధంగా చూడాలని అందుకు సంబంధించిన విషయంపై ఒంగోలులో ప్రత్యేక సమావేశం జరిగిందని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. సమావేశం అనంతరం సోమవారం రాత్రి 8 గంటల సమయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి స్వామి ఎస్సీ ఎస్టీ కేసులో త్వరగా పరిష్కరించాలని కోరారు. అంతేకాకుండా క్రిమినల్ మరియు రెవెన్యూ సివిల్ సంబంధిత కేసులు త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని నేరస్తులను వెంటనే శిక్షించే విధంగా చర్యలు ఉండాలని అధికారులను కోరినట్లు మంత్రి తెలిపారు.