కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని గ్రంథాలయం కార్యాలయంలో ఆదివారం రోటరీ క్లబ్ నూతన కమిటీ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జమ్మలమడుగు డిఎస్పి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.ఈ సందర్బంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా ముద్దనూరు వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకటకృష్ణారెడ్డి, సెక్రటరీగా సంజీవ రాయుడు, ఉపాధ్యక్షుడిగా మహమ్మద్ రఫీ లను ఎన్నుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం ఎన్నికైన నూతన కమిటీ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు.