అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఐదేళ్ల చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రెండు రోజుల క్రితం తీవ్రమైన అనారోగ్యం తో నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి హేమశ్రీ అనే చిన్నారిని తరలించారు. ఆమె చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.