ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ముఖ్య అతిథులు పేర్కొన్నారు.