ముమ్మిడివరం మండల పరిధిలోని ఠాణేల్లంక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల నందు నిర్మిస్తున్న యాక్వాట్రాన్ యూనిట్ పనులను కలెక్టర్ మహేష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా గురుకుల పాఠశాల నందు వేస్ట్ వాటర్ ప్యూరిఫైడ్, సాలిడ్ లిక్విడ్ మేనేజ్ మెంట్ యూనిట్ల కలయికతో నిర్మిస్తున్న యాక్వట్రాన్ యూనిట్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధపరచాలన్నారు.