రాజన్న సిరిసిల్ల జిల్లా లో శునకానికి అంత్యక్రియలు. గంభీరావుపేటలో ఓ దంపతులు తాము పెంచుకున్న శునకానికి ఘనంగా అంత్య క్రియలు చేశారు. యాత్వార్ రేణుక, రామకృష్ణ దంపతులు తమ పెంపుడు శునకం 'చెర్రీ' అనారోగ్యంతో మరణించడంతో కన్నీటి పర్యంతమయ్యారు. చెర్రీ మృతితో బంధువులు, కాలనీవాసులు సైతం విషాదంలో మునిగిపోయారు. అనంతరం శునకానికి అంత్య క్రియలు నిర్వహించి, స్మశానవాటికలో ఖననం చేశారు.