మల్లాపూర్ డివిజన్ దుర్గ నగర్ కాలనీలో ఓ ఇంటి యజమాని పార్కింగ్ తో మసీదుకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్నాడని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి యజమాని సెట్ బ్యాక్ లేకుండా రోడ్డుపైకి నిర్మాణం చేపట్టడం వల్ల మసీదు భక్తులకు అసౌకర్యం కలుగుతోందని, పలుమార్లు చెప్పిన పట్టించుకోకపోవడంతో మసీదు పెద్దలు కాప్రా మున్సిపల్ ఆఫీసులో, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.