Download Now Banner

This browser does not support the video element.

గుంతకల్లు: పామిడిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మట్కా స్థావరంపై పోలీసులు దాడులు: 8 మంది బీటర్లు అరెస్ట్,రూ.1,13,900 నగదు స్వాధీనం

Guntakal, Anantapur | Aug 31, 2025
పామిడి మండల కేంద్రంలోని గుత్తి రోడ్డు లో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మట్కా స్థావరంపై శనివారం రాత్రి సీఐ యుగంధర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్కడ మట్కా రాస్తున్న ఎనిమిది మంది బీటర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1,13,900 నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా మట్కా చీటీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సీఐ యుగంధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us