కాంగ్రెస్ ప్రభుత్వం చట్టపరంగా బీసీ బిల్లును తీసుకువచ్చాకే విజయోత్సవ సభలను జరుపుకోవాలని కామారెడ్డి జిల్లా జాగృతి జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు చట్టబద్ధత కల్పించకుండా సభను జరుపుకుంటే జాగృతి ఆధ్వర్యంలో అడ్డుకోవడం జరుగుతుందన్నారు ఎమ్మెల్సీ కవిత ధర్నా చేయడం వల్లే బిసి డిక్లరేషన్ తెరపైకి వచ్చిందన్నారు.